మ్యాగ్జిమమ్ సినిమాల్ని థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసమే తీస్తారు. కానీ తప్పనిసరి పరిస్థితుల మధ్య అందులో కొన్ని ఓటీటీలోకి వస్తాయి. టక్ జగదీష్ లాంటి సినిమాలు అలా వచ్చినవే. మరికొన్ని సినిమాల్ని మాత్రం కేవలం ఓటీటీని దృష్టిలో పెట్టుకొని తీస్తారు. కానీ ఊహించని విధంగా అవి థియేటర్లలోకి వస్తాయి. సన్నాఫ్ ఇండియా సినిమా అలాంటిదే.
మోహన్ బాబు నటించిన ఈ సినిమాను ఓటీటీ కోసం అనుకున్నాడట దర్శకుడు డైమండ్ రత్నబాబు. ముందుగా మోహన్ బాబు కూడా అందుకు ఒప్పుకున్నారట. గంటన్నర నిడివితో సినిమాను రెడీ చేద్దాం అనుకున్నారట. ఆ తర్వాత అనుకోకుండా సినిమాను థియేటర్ల కోసం సిద్ధం చేయాల్సి వచ్చిందంటున్నాడు ఈ దర్శకుడు.
“కరోనా సమయంలో నేను మోహన్‌బాబు గారిని కలవడం సార్ ఒక చిన్న ప్రయోగం చేద్దాం అని నేను అడగడం జరిగింది. గతంలో నాకు ఫ్లాప్ వచ్చినప్పటికీ ఆయన నాకు అవకాశం ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మాటల సందర్భంలో ఆయనకు నేను సన్ ఆఫ్ ఇండియా కథ చెప్పడం అది ఆయన ఓకే చెయ్యడం జరిగింది. ఓటీటీ కోసమని ప్లాన్ చేసి గంటన్నర నిడివి ప్లాన్ చేశాం. కానీ సినిమా వచ్చిన తర్వాత థియేటర్లను ప్రేమించే వ్యక్తిగా మోహన్‌బాబుగారు నాకు థియేటర్లంటే ఇష్టం ఓటీటీ మధ్య రిలీజ్ చెయ్యడం ఎందుకో అంతగా నాకు నచ్చదు అన్నారు. ఇందులో అద్భుతమైన డైలాగులు ఉన్నాయి. ఈ సినిమా ఎలాగైనా థియేటర్లో రావాలని అన్నారు. ఇక క్లైమాక్స్‌లో పుణ్యభూమినాదేశం, రాయలసీమ రామన్నచౌదరి లాంటి పవర్‌ఫుల్ డైలాగులు ఈ సినిమాలో ఉంటాయి. మోహన్‌బాబు పాత్రకి చిరంజీవిగారు వాయిస్ ఓవర్ ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే ఇళయరాజా లాంటి గొప్ప లెజండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకి పని చేయడం నాకు సంతోషంగా ఉంది. ఈ సినిమా నిడివి కేవలం ఒక గంట 30 నిమిషాలు మాత్రమే. ఇదొక సరికొత్త ప్రయోగం.”
ఇలా సన్నాఫ్ ఇండియా బ్యాక్ స్టోరీని బయటపెట్టాడు దర్శకుడు డైమండ్ రత్నబాబు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న ఈ సినిమాతో కచ్చితంగా హిట్ కొడతానంటున్నాడు ఈ దర్శకుడు.