బాలీవుడ్ అందాల తార సోనాక్షి సిన్హా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో సౌత్ హీరోలను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేసింది. ముసలి హీరోలంతా… కుర్ర హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తారు అంటూ ఆరోపించింది. నాకు యాబై సంవత్సరాలు వస్తే నేను సినిమాలు చేయటం మానేస్తాను కానీ… కుర్ర హీరోలతో రొమాన్స్ మాత్రం చేయనంటూ చెప్పింది.
సోనాక్షి మాటలు సినిమా ఇండస్ట్రీలో కాస్త చర్చకు దారితీశాయి. అయితే… తాజాగా బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతుంది. ఇప్పుడా మూవీలో బాలయ్య పక్కన రొమాన్స్ చేయబోతుంది సోనాక్షి సిన్హా. భారీ పారితోషికం ఆఫర్ చేసే సరికి ఈ అమ్మడు నో చెప్పలేకపోయిందని టాలీవుడ్ ఇండస్ట్రీ టాక్. ఆమె వ్యాఖ్యలు మర్చిపోయారా అని గుసగుసలు కూడా వినిపిస్తున్నా… రెమ్యూనరేషన్ టెంప్ట్ చేసినట్లుందని కామెంట్స్ వస్తున్నాయి.
బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన సింహా బ్లాక్‌బాస్టర్ కాగా, లెజెండ్ పర్వాలేదనిపించింది. ఇప్పుడు తాజా సినిమా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి.
త్రివిక్రమ్‌ను టార్గెట్ చేసిన మెగా ఫాన్స్…!