లెక్కప్రకారం ఎఫ్3 సినిమాలో ఇద్దరే హీరోయిన్లు ఉండాలి. వాళ్లు కూడా తమన్న, మెహ్రీన్ మాత్రమే. కానీ ఈసారి అనిల్ రావిపూడి మరో హీరోయిన్ ను కూడా తీసుకొచ్చాడు. ఆమె సోనాల్ చౌహాన్. ఎఫ్3 సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సోనాల్.. సినిమాలో తన పాత్ర పెద్ద సర్ ప్రైజ్ అంటోంది.
“ఎఫ్ 3లో నేను చేస్తున్న పాత్ర చాలా సర్ ప్రైజింగ్ గా వుంటుంది. ట్రైలర్ లో కూడా సీక్రెట్ గా దాచిపెట్టాం. నా పాత్రలో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ రివీల్ అయినప్పుడు ప్రేక్షకులు తప్పకుండా ఎంటర్ టైన్ ఫీల్ అవుతారు. ఇప్పటికైతే నా పాత్ర గురించి ఇంతకంటే ఎక్కువ చెప్పలేను.”
ఇలా ఎఫ్3 లో తన పాత్ర గురించి చెబుతూ ఊహించింది సోనాల్ చౌహాన్. కెరీర్ లో తొలిసారి ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేసిన ఈ బ్యూటీ.. ఎఫ్3 చేయడం ఛాలెంజింగ్ అనిపించిందని చెప్పుకొచ్చింది. అయితే సినిమా కోసం ప్రత్యేకంగా హోం వర్క్ లాంటిదేం చేయలేదని కూడా స్పష్టం చేసింది.
“ఎఫ్2 కంటే ఎఫ్ 3లో భారీ తారాగణం వుంది. అన్ని పాత్రలకు కథలో ప్రాధాన్యత వుంది. నా పాత్ర వరకూ వస్తే .. కథలో కీలకమైన పాత్రే. పైగా ఫుల్ లెంత్ కామెడీ సినిమా చేయడం నా కెరీర్ లో ఇదే మొదటిసారి. ఎఫ్ 3 లాంటి అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనర్ చేయడం ఒక ఛాలెజింగా అనిపించింది. ఎందుకంటె కామెడీ చేయడం అంత తేలిక కాదు.”
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్3 సినిమా ఈనెల 27న థియేటర్లలోకి వస్తోంది. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.