సినిమా ప్రపంచంలో ఎన్నో వివాదాలు. ఎక్కువగా రెమ్యూనరేషన్ విషయంలో జరుగుతుంటాయి. అయితే పెద్ద స్టార్ అయినా.. ఒక్కోసారి స్క్రిప్ట్ నచ్చితే తక్కువ ఫీజుతోనే పని చేయడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఫిల్మ్ మేకర్ రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా తన పుస్తకంలో నటి సోనమ్ కపూర్ గురించి ఈ విషయంలోనే ప్రత్యేకంగా ప్రస్తావించారు.
భాగ్ మిల్కా భాగ్ సినిమాకు దర్శక, నిర్మాతగా వ్యవహరించారు ఓం ప్రకాష్. ఈ సినిమాలో సోనమ్ ఓ గెస్ట్ పాత్ర చేసింది. దానికోసం ఆమె కేవలం రూ.11 మాత్రమే తీసుకుందని చెప్పారు ఓం ప్రకాష్. ఈ విషయాన్ని తన ఆత్మకథ ది స్ట్రేంజర్ ఇన్ ది మిర్రర్ పుస్తకంలో రాశారాయన. ఓం ప్రకాష్, సోనమ్ ఇంతకుముందు ఢిల్లీ 6 సినిమా కోసం కలిసి పనిచేశారు.