బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ తనయగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సోనమ్ కపూర్.. తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకుంది. బాలీవుడ్ లో స్టార్ బ్యూటీగా పేరు సంపాదించుకుంది. తాజాగా సోనమ్ కపూర్ రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ లో సందడి చేసింది. తన అందచందాలతో అందరినీ కట్టిపడేసింది. ఎరుపురంగు దుస్తుల్లో ఆమె అందరినీ ఎట్రాక్ట్ చేసింది.
ప్రముఖ డిజైనర్ రామి కది రూపొందించిన రెడ్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించిన సోనమ్.. రెడ్ కార్పెట్‌పై నడుస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. సౌదీ అరేబియాలోని జడ్డా నగరంలో రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ సందడిగా సాగుతోంది. కార్యక్రమంలో భాగంగా రెండో రోజు సోనమ్ పాల్గొని సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను సోనమ్ సోషల్ మీడియా షేర్ చేసింది.
అంతకు ముందు వానిటీ ఫెయిర్ డిన్నర్‌లో సోనమ్ పసుపు రంగు దుస్తులు ధరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. తల్లి అయిన తర్వాత మొదటిసారిగా సోనమ్ ఇలా కనిపించడంతో ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు.
కాగా కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో 2018లో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ అహుజాను ప్రేమ వివాహం చేసుకుంది సోనమ్. ఈ ఏడాది ఆగస్టు 20న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లైనా లేటెస్ట్ ఫ్యాషన్ వేర్ లో ఎప్పటి కప్పుడు అప్‌డేట్ అవుతూ ఫ్యాన్స్ ని పలకరిస్తూ ఉంటుంది.
View this post on Instagram