విడాకుల గురించి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ స్పందించారు. విడాకులు తిరోగమన చర్యలంటూ మోహన్ భగవత్ అన్న మాటలను ప్రస్తావిస్తూ… బుద్దిగల వాళ్లెవరైనా ఇలా మాట్లాడతారా? తిరోగమనం అనేది తెలివి తక్కువ వ్యాఖ్యలు, అని సోనమ్ కపూర్ ట్వీట్ చేశారు.
ఆదివారం ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ విద్యావంతులు, సంపన్న కుటుంబాల్లో కూడా ఇటీవల విడాకుల కేసులు ఎక్కువుగా చూస్తున్నాం… విద్య, సంపదతో పాటు ఆవేశం కూడా వస్తూ కుటుంబాలను నాశనం చేస్తున్నాయన్నారు. ప్రజలు చిన్ని చిన్న విషయాలపై గొడవ పడుతున్నారు. భారతదేశంలో హిందూ సమాజానికి ప్రత్యామ్నాయం లేదన్నారు. హిందూ సమాజం తప్ప భారతదేశానికి వేరే అవకాశం లేదు..హిందూ సమాజానికి కుటుంబంగా వ్యవహరించడమే తప్ప వేరే అవకాశం లేదని చెప్పారు. ఆరెస్సెస్ కార్యకర్తలు, వారి కుటుంబ సభ్యులతో జరిగిన సమావేశంలో ఈ మాటలన్నారు.
మహిళలు ఇంటికే పరిమితం కావడం అనే అంశంపై వాదిస్తూ 2000 సంవత్సరాల క్రితం సమాజం వేరు…ఇప్పుడు అంతా మారిపోయిందన్నారు. సమాజం ఇప్పుడిలా ఉందంటే గత 2000 ఏళ్లుగా ఆ ఆచారాలను పాటించడం వల్లనే అన్నారు. ఇప్పుడు మహిళలు ఇంటికే పరిమితమవుతున్నారు. 2 వేల ఏళ్ల నాడు ఇలాంటి పరిస్థితులు లేవు. అవి స్వర్ణ యుగాలు అని చెప్పారు భగవత్. సంఘ్ కార్యక్రమాల గురించి మీ కుటుంబ సభ్యలకు తెలియజేయాలని కోరారు.
మోహన్ భగవత్ వ్యాఖ్యలపై సోనమ్ కపూర్ ట్వీట్స్ కు ట్విట్టర్ లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొందరు ఆమె వ్యాఖ్యలను సమర్ధిస్తుండగా…మరికొందరు విమర్శిస్తున్నారు.