బాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ తారల పిల్లలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. అందులో సోనమ్ కపూర్ ఒకరు. మంచి సినిమా కథలను ఎంచుకుంటూ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకుంది.
అనంతరం పెళ్లి చేసుకున్న సోనమ్.. మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించింది. 2019లో ‘ద జోయా ఫ్యాక్టర్’ అనే చిత్రంలో నటించిన ఆమె.. ఆ తర్వాత ఏ సినిమా చేయలేదు.
ఇక రీసెంట్ గా ఆమె ముంబైలోని సిగ్నేచర్ ఐలాండ్ లో లగ్జరీ అపార్ట్ మెంట్ తీసుకుంది. దాని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ ఫ్లాట్ ఖరీదు సుమారు రూ.32 కోట్లు ఉంటుందని మీడియాలో పలు కథనాలు వచ్చాయి.
మొత్తం నాలుగు కార్ల పార్కింగ్ స్లాట్ లతో కూడిన థర్డ్ ఫ్లోర్ లో సోనమ్ కపూర్ ఉంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట్లో జోరుగా వైరల్ అవుతున్నాయి.