కరోనాకు చెక్ పెట్టేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం జనతా కర్ఫ్యూకు పిలుపునివ్వడంతో.. జనతా కర్ఫ్యూపై అవగాహనా కల్పిస్తూ బాలీవుడ్ సింగర్ మాలినీ అవస్తీ పాట పాడారు. దీనిని మోదీ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. జనతా కర్ఫ్యూను సక్సెస్ చేసేందుకు చాలామంది తమకు తోచిన విధంగా కృషి చేస్తున్నారని.. సింగర్ మాలినీ పాట ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు మరింత స్ఫూర్తినింపిందని మోదీ ట్వీట్ చేశారు.
కరోనా ఇండియాలోకి ప్రవేశించి అందర్నీ భయపెడుతోంది. కరోనా ఎక్కడ తమకు సోకుతుందోనన్న భయం అందరిలో కనిపిస్తోంది. ధైర్యాన్ని కల్పోకుండా ,చిరునవ్వుతో దేశ ప్రజలంతా కరోనాను ఎదుర్కోవాలంటూ సాగిన ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈపాటలో కరోనా బారి నుంచి బయటపడేందుకుగాను తీసుకోవాల్సిన జాగ్రత్తలను కుడా పొందుపర్చారు.
जनता कर्फ्यू को लेकर हर कोई अपनी-अपनी तरह से योगदान देने में जुटा है। लोक गायिका @maliniawasthi जी अपने अंदाज में लोगों को प्रेरित कर रही हैं… #JantaCurfew https://t.co/APhgwP2UlP
— Narendra Modi (@narendramodi) March 22, 2020