కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు(బ్రాంకైటీస్)తో ఢిల్లీలోని గంగా రామ్ ఆస్పత్రిలో చేరారు. ఈ మేరకు విషయాన్ని ఆస్పత్రి వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి.
నిన్న రాత్రి ఆమె ఆస్పత్రిలో చేరారని ఆస్పత్రి ప్రతినిధి తెలిపారు. జ్వరం కారణంగా చెస్ట్ మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్ అరూప్ బసు; అతని బృందం పర్యవేక్షణలో సోనియా గాంధీ ఉన్నారని ఆస్పత్రి ట్రస్ట్ సొసైటీ చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు.
ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆమెకు ప్రస్తుతం వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్టు హెల్త్ బులిటెన్ లో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
ఈ ఏడాది ఆమె ఆస్పత్రిలో చేరడం ఇది రెండో సారి. ఈ ఏడాది జనవరిలో సోనియా గాంధీ వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్‌తో చికిత్స కోసం ఢిల్లీ ఆసుపత్రిలో చేరారు.