కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈరోజు ఆస్పత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆమె ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమె వెంట కూతురు ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు.
సోనియాగాంధీ శ్వాసకోస ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నారని ప్రాథమిక సమాచారం. ఆమె ఆరోగ్యం మంగళవారం కొంచెం క్షీణించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భారత్ జోడో యాత్ర మధ్యలో నుంచి అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు ఢిల్లీకి వచ్చినట్టు సమాచారం.
భారత్ జోడో యాత్ర ప్రస్తుతం యూపీలో కొనసాగుతోంది. కొన్ని నెలల క్రితం ఆమె వైద్య చికిత్స నిమిత్తం విదేశాలకు వెళ్లారు. ఆమె అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య ట్వీట్ చేశారు.
గతేడాది సోనియా గాంధీ కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆమె మెడకు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు విదేశాలకు వెళ్లారు. కర్ణాటకలోని మాండ్యలో భారత్ జోడో యాత్రలో ఆమె పాదయాత్రలో పాల్గొన్నారు.