గత వారం సాధారణ పరీక్షల నిమిత్తం ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆసుపత్రి మేనేజ్‌మెంట్ బోర్డ్ ఛైర్మన్ డాక్టర్ అజయ్ స్వరూప్ తెలిపారు.
మధ్యాహ్నం 3 గంటలకు సోనియా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు. ప్రస్తుతం సోనియా ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. గతవారం సోనియా గాంధీ సాధారణ పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారు.
సోనియా వెంట తన కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఉన్నారు. సోనియాగాంధీ గత కొద్ది రోజులుగా కొవిడ్ అనంతర సమస్యలతో బాధపడుతున్నారు. కరోనా బారిన పడిన అనంతరం వివిధ అనారోగ్య సమస్యలు సోనియాగాంధీని చుట్టుముట్టాయి.
అంతుకుముందు నుంచే ఆమె శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మెడికల్ చెకప్ కోసం ఆమె విదేశాలకు కూడా వెళ్లొచ్చారు.