ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ లేఖ రాశారు. నేషనల్ హెరాల్డ్ పత్రిక మనీలాండరింగ్ కేసులో దర్యాప్తునకు హాజరయ్యేందుకు తనకు మరింత సమయం కావాలని లేఖలో ఆమె కోరారు.
కరోనా పాజిటివ్ రావడంతో సోనియాగాంధీ ఢిల్లీలోని సర్ గంగారాం ఆస్పత్రిలో జూన్ 12న చేరారు. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమెను వైద్యులు పర్యవేక్షణలో ఉంచారు.
మనీలాండరింగ్ కేసులో జూన్ 8న ఆమె ఈడీ ఎదుట హాజరు కావాల్సి వుండగా కరోనా నేపథ్యంలో తనకు మరింత సమయం కావాలని ఆమె ఈడీని కోరారు. దీంతో ఈడీ కూడా ఓకే చెప్పింది.
తాజాగా రెండు రోజుల క్రితం ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చా్ర్జ్ అయ్యారు. తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తనకు మరి కొన్ని రోజుల సమయం కావాలని ఈడీని కోరారు. దీంతో ఈడీ మరోసారి అంగీకారం తెలిపింది.