కరోనా కారణంగా పాఠశాలల్లో నిలిచిపోయిన మధ్యాహ్న భోజన పథకాన్ని వెంటనే పునః ప్రారంభించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కోరారు.
లోక్ సభలో బుధవారం జీరో హవర్ లో ఆమె మాట్లాడుతూ.. పాలిచ్చే తల్లులకు, గర్బిణులకు, మూడేండ్ల లోపు పిల్లలకు వేడిగా వండిన వంటలను అందుబాటులో ఉండేలా చేయాలని ఆమె అన్నారు.
కరోనా సమయంలో మొదటగా పాఠశాలలను మూసి వేశారని, అన్నిటికన్నా చివరగా వాటిని తెరచారని దానివల్ల చిన్న పిల్లలు ఎంతో నష్టపోయారని ఆమె తెలిపారు.
పాఠశాలలు మూతపడటంతో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయింది. జాతీయ ఆహార భద్రతా చట్టం, సుప్రీంకోర్టు ఆదేశాల కారణంగా ప్రజలకు పొడి రేషన్ అందించారు. కానీ, పిల్లలకు అందించే పోషకాహర భోజనానికి ఇది ప్రత్యామ్నాయం కాదు’ అని ఆమె చెప్పారు.
Advertisements
కానీ ఇప్పుడు, పిల్లలు పాఠశాలకు తిరిగి వచ్చారు. అందువల్ల వారికి మంచి పోషకాహారం అందించాలి. మహమ్మారి సమయంలో చాలా మంది పాఠశాలకు రావడం మానేశారని, వారిని పాఠశాలకు తిరిగి రప్పించడంలో మధ్యాహ్న భోజన పథకం సహాయపడుతుంది’ అని పేర్కొన్నారు.