కరోనా సమయంలో ఎంతో మంది పేద ప్రజలకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు నటుడు సోనూసూద్. సోనూసూద్ చేసిన పనులకు గాను దేశం మొత్తం అభిమానులను సంపాదించుకున్నాడు. తాజాగా మరో ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు.
ట్విటర్ ఫాలోయింగ్‌లో బాలీవుడ్ సూపర్‌స్టార్లను సైతం వెనక్కి నెట్టేసి నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. భారత్‌లో అత్యధిక ఫాలోయింగ్ కలిగిన వ్యక్తుల జాబితాలో సూనూ సూద్ నాలుగో స్థానం దక్కించుకున్నాడు. ఈ జాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఆ తరువాత రాహుల్ గాంధీ, విరాట్ కోహ్లీ, సోను సూద్ ఉన్నారు. ఫాలోయింగ్ విషయంలో బాలీవుడ్ ప్రముఖ స్టార్లందరినీ మించిపోయాడు.