లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసి వారి పాలిట దేవుడు అయ్యాడు నటుడు సోనూసూద్. ఇక అప్పటి నుంచి కూడా ఎవరు ఏ సహాయం అడిగినా కాదనకుండా వారిని ఆదుకుంటున్నాడు. ఇప్పటికే సోనూసూద్ ను చాలా దగ్గర్ల దేవుడి తో పోలుస్తూ గుడులు కూడా కడుతున్నారు.
తాజాగా సోనూసూద్ మరోసారి తన సేవా గుణం చాటుకున్నాడు. ఇటీవల సోను సూద్ కొన్ని వ్యాన్ లను కొన్నాడట. అయితే వాటిని అంబులెన్సులు గా మార్చి ప్రజలకు సేవ చేసేందుకు కొత్త సర్వీసులు తీసుకువచ్చాడు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర వాటిని ప్రారంభించాడు. రానున్న రోజుల్లో వీటిని మరింత విస్తృతం చేస్తామని ఆంధ్ర ,తెలంగాణ రాష్ట్రాలలో మెడికల్ సర్వీసులను అందుకోలేని వారికి ఇవి సహాయం చేస్తాయని వీటి ద్వారా సహాయం కోసం ఎదురుచూస్తున్న వారిని రక్షించగలగుతామని సోనూసూద్ చెప్పుకొచ్చారు.