కరోనా సమయంలో ఎంతోమంది పేద ప్రజలకు తన వంతు సహాయం రియల్ హీరో అయ్యాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి సహాయం చేసి ఆదర్శంగా నిలిచాడు. సోను సేవలకు గాను ఎంతో మంది అభిమానం తో గుడులు కూడా కడుతున్నారు. మరికొంతమంది తమ పిల్లలకు పేర్లు కూడా పెట్టుకున్నారు. అయితే సోనూసూద్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.
ఈ సినిమాలో సోనూసూద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. కాగా బుధవారం షూటింగ్ సెట్ లో 100 మంది యూనిట్ సభ్యులకు సెల్ ఫోన్ లను పంచారు సోనూ. సెల్ ఫోన్ లు పెంచడం పట్ల యూనిట్ సభ్యులు సోనూ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్ లు మరోసారి సోషల్ మీడియాలో ఆకాశానికెత్తుతూ పొగడ్తలు పొగుడుతున్నారు.