కరోనా వైరస్ సమయంలో ఎంతో మందికి అండగా నిలిచి, రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు సోనూసూద్. ఆపదలో ఉన్నాను అని పిలిస్తే చాలు సహయం చేసి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్… కొందరికి ఆర్థిక సహయం చేస్తూ వారి కుటుంబాలను కూడా నిలబెట్టాడు.
ఇప్పుడు సోనూసూద్ ఉచితంగా ఈఎన్టీ వైద్యం, సర్జరీలు చేయించబోతున్నాడు. సూద్ ఛారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో ఈ వైద్య సహయం చేయబోతున్నామని… రుచి, వాసన, ద్వని ఇకపై స్వేచ్ఛగా ఆస్వాదిద్దాం అంటూ సోనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సేవలు ఎలా అందుకోవాలో చెప్పే వెబ్ సైట్ లింకును కూడా పెట్టేశాడు.
www.soodcharityfoundation.org సైట్ లో లాగిన్ అయిన తర్వాత సర్జరీలు కావాల్సిన వారు తమ డేటాను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఇటీవలే సోనూసూద్ ఇండ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. 20కోట్ల పన్ను చెల్లించని ఆదాయం ఉన్నట్లు గుర్తించారని వార్తలొచ్చాయి.