కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ లు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వటంతో షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ బుల్లితెర షో అయిన కపిల్ శర్మ షో కూడా ప్రారంభం అయింది. ఆ షో కు మొదటి గెస్ట్ గా నటుడు సోనూసూద్ హాజరయ్యారు. అంతే కాదు లాక్ డౌన్ వేళ తాను సహాయం చేసిన వలస కూలీలతో వీడియో కాల్ మాట్లాడారు. వారితో మాట్లాడుతున్న సమయంలో సోనూసూద్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్నాడు. ఇక షో గురించి కపిల్ శర్మ ప్రత్యేకమైన ట్వీట్ చేసారు. సోనూసూద్ తో తీసిన ఎపిసోడ్ ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. సోనూ సూద్‌ను ది రియల్ హీరో ఆఫ్ 2020’ అంటూ కొనియాడారు.