కరోనా మహమ్మారి దేశంలో విచ్చలవిడిగా వ్యాప్తి చెందుతున్న వేళ ఎంతోమంది పేద ప్రజలకు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నాడు నటుడు సోనూసూద్. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేసి వారి మనసులను గెలుచుకొన్నాడు. ఇక సోనూసూద్ చేసిన సేవలకు గాను దేశవ్యాప్తంగా ఎంతోమంది పేద ప్రజలు సోనూ ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. వారి షాపులకు, పిల్లలకు సోనూ పేరు ను కూడా పెట్టుకున్నారు..అంటే అతిశయోక్తి కాదు.
తాజాగా తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తండాలో పరిధిలోని చెలిమి తండాకు చెందిన రాజేష్ రాథోడ్ అనే వ్యక్తి సోనుసూద్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. తన సొంత ఖర్చుతో ఈ విగ్రహం ఏర్పాటు చేయడం విశేషం. ఇదిలా ఉండగా స్థానికులు సోనూసూద్ విగ్రహానికి పూజలు నిర్వహించి హారతి ఇస్తున్నారు. ఇదే విషయమై సోనూసూద్ స్పందిస్తూ నేను అందుకు అర్హుడిని కాను అంటూ ట్విట్టర్ ద్వారా రిప్లయ్ ఇచ్చాడు.
Don’t deserve this sir.
Humbled🙏 https://t.co/tX5zEbBwbP— sonu sood (@SonuSood) December 21, 2020