కరోనా లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి సోనూ సూద్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ సోనూ వలస కార్మికులకు సహాయం అందిస్తూనే ఉన్నాడు. అలాగే ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూనే ఉన్నాడు. దీంతో సోనూసూద్‌కు ఎన్నో లక్షల మంది ఫ్యాన్స్ కొత్తగా ఏర్పడ్డారు. అయితే ఓ సూపర్ ఫ్యాన్ మాత్రం ఏకంగా సోనూసూద్ పేరును, బొమ్మను చేతిపై టాటూ వేయించుకున్నాడు.

శుభం అనే ఓ వ్యక్తి సోనూసూద్‌తో ఎప్పటినుంచో టచ్‌లో ఉంటున్నాడు. సోనూసూద్‌కు ఎప్పటికప్పుడు బయటి పరిస్థితి తెలపడంతోపాటు సోనూ చేసే సహాయ కార్యక్రమాల్లోనూ శుభం పాల్గొన్నాడు. ఈ క్రమంలో సోనూసూద్ కు శుభం సూపర్ ఫ్యాన్ అయ్యాడు. అంతటితో అతను ఆగలేదు. సోనూ బొమ్మ, పేరును చేతిపై టాటూ వేయించుకున్నాడు. ఇటీవలే సోనీ టీవీకి చెందిన బెస్ట్ డ్యాన్సర్ అనే కార్యక్రమం సెట్స్‌లో శుభం సోనూను కలిశాడు. దీంతో సోనూ తన పేరు, బొమ్మ టాటూను అతని చేతిపై చూసి షాకయ్యాడు.
Watch insta video:
అయితే తన పట్ల అభిమానం కలిగి ఉండడం వరకు ఓకే కానీ.. ఫ్యాన్స్ ఎవరూ ఇలా టాటూలు వేయించుకోవద్దని సోనూ కోరాడు. కాగా సోనూ జడ్జిగా వ్యవహరించిన ఆ షో స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రసారం కానుంది. ఇక ఇటీవలే ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మకు చెందిన షోలోనూ సోనూసూద్ కనిపించి అలరించాడు. కాగా సోనూసూద్ తన అభిమాని వేయించుకున్న ఆ టాటూను చూస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.