కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఎంతోమంది అభిమానుల అభిమానాన్ని గెలుచుకున్నాడు. సినిమాలో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో హీరో అనిపించుకున్నాడు. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి తన వంతు సహాయం చేసి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపాడు. ఇదిలా ఉండగా ప్రపంచంలో యు.కె.కి చెందిన పాపులర్ మేగజైన్ ఈస్టర్న్‌ఐ ఓ సర్వే నిర్వహించింది.అందులో భాగంగా టాప్ 50 ఏషియన్ సెలబ్రిటీస్ గ్లోబల్ 2020 లిస్ట్‌ను ఈస్టర్న్ ఐ తయారు చేసింది. ఈ ఏషియా సెలబ్రిటీస్ ఇన్ ది వరల్డ్ జాబితాలో బాలీవుడ్ నటుడు సోనూసూద్ నెంబర్ వన్ స్థానంలో నిలిచారు.
ఇదే విషయమై సోనూ సూద్ స్పందిస్తూ నా ఎఫర్ట్స్‌ను గుర్తించినందుకు ఈస్టర్న్ ఐ పత్రికకు ధన్యవాదాలు. కోవిడ్ సమయంలో నా బాధ్యతగా నా దేశ పౌరులకు అండగా నిలబడ్డాను. ప్రజలు నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయతల అందించారు. ఈ కార్యక్రమాలను నా చివరి శ్వాస వరకు ఆపను అంటూ చెప్పుకొచ్చారు.
आभार भाई🙏 https://t.co/nIy0Rfu1N0
— sonu sood (@SonuSood) December 10, 2020