కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ సమయంలో అన్ని రంగాలకి చెందిన పరిశ్రమలు మూత పడ్డాయి. దీంతో జనాలందరు ఇళ్లల్లో కూర్చొని ఖాళీ సమయాన్ని వినియోగించుకుంటున్నారు. కొందరు స్టార్స్ వంట చేస్తుంటే మరికొందరు ఇంటి పనులు చేసుకుంటూ ఉన్నారు. మరికొందరు పూర్తిగా పిల్లలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే టాలీవుడ్ లో విలన్ గా నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న సోనూసూద్ కూడా తన లాక్ డౌన్ టైంను బిజీగా గడుపుతున్నాడు. కొడుకు ఇషాంత్ సూద్ తో కలిసి కండలు పెంచే పనిలో ఉన్నాడు. సిక్స్ ప్యాక్ తో కనిపించే సోనూ సూద్ తన కొడుకుతో కూడా ఈ టైంలో ఎక్కువ శాతం వర్కౌట్స్ చేయిస్తున్నాడట. ఈ తండ్రి కొడుకుల బాడీ బిల్డింగ్ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.