ప్రస్తుతం సినీ వర్గాల్లో వాల్తేర్ వీరయ్య మేనియా నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాతో సంక్రాంతి బరిలో నిలుస్తుండటంతో అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. దీనికి తోడు ఈ చిత్రం నుంచి ఒక్కొక్కటిగా వస్తున్న అప్‌డేట్స్ మెగా లోకాన్ని హుషారెత్తిస్తున్నాయి.రోజుకో అప్‌డేట్ వదులుతూ ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న వీరయ్య టీమ్.. ఇప్పటికే బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి సాంగ్, పూనకాలు లోడింగ్ పాటలతో హూషారెత్తించారు. దీంతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటాయి.
ఈ క్రమంలోనే తాజాగా వాల్తేరు వీరయ్య సినిమాలోని ఐదో సింగిల్ గురించి కీలక అప్‌డేట్ ఇచ్చారు మెగాస్టార్. ఆ పాట ఏ లొకేషన్లలో, ఎలా చిత్రీకరించారో చూపుతూ ఒక బీటీఎస్ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.త్వరలోనే ఈ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ కానుంది. ఈ పాటను ఫ్రాన్స్‌లోని టౌలౌస్‌లో చిత్రీకరించినట్లు చిరంజీవి తెలిపారు. నీకేమో అందం ఎక్కువ.. నాకేమో తొందరెక్కువా’ అనే లిరిక్స్ తనను బాగా ఆకట్టుకున్నాయని చెప్పిన చిరు.. ఈ పాటలోని స్టెప్పులు చూసి అభిమానులు పండగ చేసుకుంటారని చెప్పారు.
దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ట్యూన్, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు మేజర్ అసెట్స్ అని చిరంజీవి అన్నారు. మెగాస్టార్ చెప్పిన ఈ మాటతో అందరిలో ఈ పాటపై ఓ రకమైన క్యూరియాసిటీ ఏర్పడింది.మాస్ కమర్షియల్ అంశాలు ఫుల్లుగా ఉండేలా ఈ వాల్తేరు వీరయ్య కథ రాసుకున్నారట డైరెక్టర్ బాబీ. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ అవుట్ పుట్ రాబట్టారట.
భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. మాస్ మహారాజ్ రవితేజ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2023 జనవరి 13వ తేదీన భారీ ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.జనవరి 8న వాల్తేర్ వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో గ్రాండ్ గా చేయాలని భావిస్తున్న చిత్ర యూనిట్.. ఈ వేడుకను వైజాగ్‌లో నిర్వహించాలని ఫిక్సయినట్లు సమాచారం. సర్వ హంగులతో అట్టహాసంగా ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.