ఒకరు ఐఏఎస్, మరొకరు ఐపీఎస్.. ఇద్దరి మధ్య కొన్ని రోజుల నుంచి నడుస్తున్న వార్ ఆఫ్ వర్డ్స్.. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. నేషనల్ వైడ్ గా ఇంట్రెస్టింగ్ అయిన ఈ ఇష్యూ కాస్త ఇప్పుడు సెల్లింగ్ ఐటెమ్ గా మారింది. ఇద్దరూ పవర్ ఫుల్ పొజిషన్లో ఉన్న లేడీస్.. సో ఇద్దరు స్టార్ హీరోయిన్స్ ని కాస్ట్ చెయ్యగలిగితే ఓ మంచి ఫీమేల్ మల్టీ స్టారర్ సినిమాతో కమర్షియల్ సక్సెస్ గ్యారంటీ.
ఈ విషయంలో మన ఇండస్ట్రీ వాళ్ళు ముందుంటారు. అయితే త్వరలోనే ఓ పవర్ ఫుల్ లేడీ మల్టీస్టారర్ మూవీ రియల్ స్టోరీతో చూడ్డానికి సిద్ధంగా ఉండాల్సిందే మనం. ఇక కాస్త ఫుల్ డీటైల్స్ లోకి వెళితే..కర్ణాటకలో గత కొన్ని రోజులుగా, బహిరంగ ఆరోపణలు చేసుకుంటూ దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కారు ఇద్దరు సివిల్ సర్వీసెస్ అధికారిణులు. కర్ణాటక కేడర్ ఐఏఎస్ రోహిణి, ఐపీఎస్ ఆఫీసర్ రూప మధ్య గత కొన్ని రోజులుగా వార్ ఆఫ్ వర్డ్స్ నడుస్తోంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నేషనల్ వైడ్ హాట్ టాపిక్ అయ్యారు.
దీంతో ఈ ఇద్దరి గొడవపై సినిమా వాళ్ల దృష్టి పడింది. క్రియేటివ్ డైరెక్టర్ అనే దగ్గరి నుంచి సెన్సేషనల్ డైరెక్టర్ అని పిలిపించుకునే వరకూ వచ్చిన ఆర్జీవీ.. ఇండస్ట్రీ హిట్స్ కి, న్యూ ఏజ్ ఫిల్మ్స్ కి కేరాఫ్ అడ్రస్. సో వివాదాస్పదం అయిన విషయాలు, ఎక్కువగా కాంట్రవర్సీ క్రియేట్ చేసిన టాపిక్స్, రియల్ లైఫ్ స్టోరీస్… ఇలాంటి విషయాలనే కథాంశంగా చేసుకొని సినిమాలు చేస్తున్న ఆర్జీవీ కన్ను ఈ ఇష్యూ పై పడింది.
అయితే ఈ ఆలోచన మొదట చేసింది మాత్రం ఆర్జీవీ కాదు. బియాండ్ డ్రీమ్స్ అనే నిర్మాణ సంస్థతో పాటు.. ప్రవీణ్ శెట్టి అనే సినీ నిర్మాత కూడా రోహిణి వర్సెస్ రూప గొడవతో సినిమా చెయ్యడానికి కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ కి దరఖాస్తు చేసుకున్నారు. ‘ఆర్ వి వర్సెస్ ఎస్ ఆర్’ పేరు కావాలని బియాండ్ డ్రీమ్స్ అనే సంస్థ ద్వారా దరఖాస్తు చేసానని దర్శకుడు నిత్యానంద ప్రభు తెలిపారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. మరో వైపు కర్ణాటకలో ఐఏఎస్ అధికారిణి రోహిణీ సిందూరి, ఐపీఎస్ అధికారిణి రూపా మౌద్గిల్ పై ఇప్పటికే కర్ణాటక ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.