ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌కు చెందిన అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఇప్పటికే అనేక డివైస్‌లలో యూజర్లకు లభిస్తున్న విషయం విదితమే. యూజర్లు ఎంపిక చేసుకున్న విధంగా ఆడ లేదా మగ గొంతు అలెక్సా వాయిస్ అసిస్టెంట్ రూపంలో వినిపిస్తుంది. అమెజాన్‌కు చెందిన ఎకో, ఫైర్ టీవీ స్టిక్‌లతోపాటు పలు ఇతర డివైస్‌లలోనూ అలెక్సా ప్రస్తుతం అందుబాటులో ఉంది. అయితే ఇకపై అలెక్సాకు గాను ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ గొంతు యూజర్లకు వినిపించనుంది.
అమితాబ్ బచ్చన్ తో అమెజాన్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆయన గొంతు ఇకపై మనకు అలెక్సా వాయిస్ అసిస్టెంట్ రూపంలో వినిపించనుంది. అలెక్సా ద్వారా వార్తలు, ఇతర సమాచారం, వాతావరణం, జోక్స్ వంటి వివరాలను తెలుసుకోవచ్చు. వాటిని అలెక్సా చదివి వినిపిస్తుంది. అయితే ఇకపై అలెక్సా ద్వారా మనకు అమితాబ్ బచ్చన్ గొంతు వినిపిస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం అలెక్సా టెక్నికల్ టీం ఆయన గొంతును రికార్డు చేసి ఆ సాఫ్ట్‌వేర్‌లో ప్రోగ్రామింగ్ చేయనున్నారు.
ఇక అలెక్సా వాయిస్ అసిస్టెంట్ రూపంలో అమితాబ్ గొంతు వినేందుకు ఇంకో ఏడాది పడుతుంది. ప్రస్తుతం ఆయన వాయిస్‌ను రికార్డు చేసి టెస్ట్ చేస్తున్నారు. అనుకున్న ప్రకారం అన్నీ జరిగితే వచ్చే ఏడాది నుంచి అమితాబ్ గొంతును మనం వాయిస్ అసిస్టెంట్ రూపంలో వినేందుకు అవకాశం ఉంటుంది.
కాగా అమితాబ్ గొంతు అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌లో అందుబాటోకి వస్తే.. కేవలం వార్తలు, ఇతర వివరాలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా.. అమితాబ్‌కు చెందిన పలు సినిమాల్లోని డైలాగ్‌లు, జోక్‌లు, మోటివేషనల్ కోట్స్, సలహాలు కూడా వినవచ్చు. అన్నీ ఆయన గొంతులోనే మనకు వినిపిస్తాయి. అమెజాన్ అలెక్సా వాయిస్ అసిస్టెంట్ అన్ని ఎకో డివైస్‌లతోపాటు ఫైర్ టీవీ స్టిక్, అలెక్సా యాప్‌లు, ఇతర డివైస్‌లలో ప్రస్తుతం యూజర్లకు అందుబాటులో ఉంది.