గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు రియల్ హీరో సోను సూద్. విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో సోనూసూద్ పాల్గొననున్నారు. సోనూసూద్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ బయలుదేరారు సోనూసూద్.
ఇక కరోనా సమయంలో ఎంతో మంది పేద ప్రజలకు వలస కూలీల కు సహాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూసూద్. సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించారు.