ఒకప్పుడు హీరోయిన్ సౌందర్యకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అగ్ర హీరోయిన్ గా ఆమె ఎందరో హీరోలతో మంచి సినిమాలు చేసింది ఆమె. ప్రమాదవ శాత్తు చిన్న వయసులోనే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. ఇక మన తెలుగులో సావిత్రి తర్వాత ఆమెను ఆ రేంజ్ లో ఫాన్స్ దగ్గర చేసుకున్నారు అనే మాట వాస్తవం. స్కిన్ షో చేయడానికి ఆమె ఏ మాత్రం ఇష్టపడలేదు.
ఫ్యామిలీ కథలతో మంచి సినిమాలు చేసి హిట్స్ కొట్టింది. ఇక ఎలాంటి పాత్రలో అయినా సరే సౌందర్య నటనకు విమర్శకులు సైతం ఫిదా అయిన సందర్భాలు ఉన్నాయి. వెంకటేష్, జగపతి బాబు, చిరంజీవి సహా ఎందరో హీరోలతో ఆమె సినిమాలు చేసింది. చేసిన ప్రతీ హీరోతో హిట్ కొట్టింది. అయితే సౌందర్య ఒక హీరోతో మాత్రం అప్పట్లో సినిమా చేయడానికి ఇష్టపడలేదు. నిర్మాత అడిగినా సరే నో చెప్పింది.
ఆ హీరో ఎవరో కాదు… కమెడియన్ అలీ. అలీ హీరోగా వచ్చిన యమలీల సినిమాను ఎస్వీ కృష్ణా రెడ్డి డైరెక్ట్ చేసారు. ఆ సినిమాలో హీరోయిన్ గా సౌందర్యను తీసుకోవాలి అనుకున్నారు. కాని ఆమె మాత్రం అందుకు నో చెప్పింది. కథ విన్న తర్వాత హీరో ఎవరు అని అడగగా కృష్ణా రెడ్డి… అలీ పేరు చెప్తే మొహం మీదనే నో చెప్పారట. ఆ తర్వాత ఇంద్రజని అడిగితే ఆమె ఓకే అన్నారు.