అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ డిశ్చార్జీ అయ్యారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఐదు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. గతంలో ఒక స్టెంట్ వేయించుకున్న గుంగూలీకి మరోసారి యాంజియోప్లాస్టీ నిర్వహించి 2 స్టెంట్లు వేశారు.
దాదాకు ఇటీవల తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవలే ఇంట్లో ఎక్సర్‌సైజ్ చేస్తున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఐదు రోజుల తర్వాత డిశ్చార్జీ అయ్యారు. కాగా బుధవారం మరోసారి ఆయనకు ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో మళ్లీ గంగూలీ ఆసుపత్రికి వెళ్లారు. ప్రముఖ వైద్య నిపుణులైన దేవీ శెట్టి, అశ్విన్ మెహతాలతో కూడిన టీమ్.. గంగూలీకి తాజా యాంజియోప్లాస్టీ నిర్వహించింది.