ఇండియన్ క్రికెట్ మాత్రమే కాదు యావత్ క్రికెట్ ప్రపంచం అంతా ధోని అంటే ఔరా అంటుంది. కానీ గంగూలీ మాత్రం ధోనిపై పగ తీర్చుకుంటున్నట్లు ఉన్నారు అంటూ సమసిపోయిన వివాదాలను తెరపైకి తెస్తున్నారు కొందరు క్రికెట్ పండితులు. అయితే ఈ తాజా వివాదానికి బీసీసీఐ అద్యక్షుడు గంగూలీయే ఆజ్యం పోశాడు.
సముద్రంలో ఢీకొన్న రెండు భారీ నౌకలు
ఎలాగంటే… గంగూలీ తన డ్రీమ్ ఐపీఎల్ టీం ఇదే అంటూ జట్టును ప్రకటించారు. డ్రీమ్ టీమ్‌ను ప్రకటించటం క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన అందరూ చేస్తుంటారు. కానీ తాజాగా గంగూలీ ఇచ్చిన లిస్ట్‌ను చూసి అంతా అవాక్కయితున్నారు. దాదా మనసులో ఎదో ఉందంటు అనుమానిస్తున్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌కు ముందు తన ఐపీఎల్ డ్రీమ్‌టీంను ప్రకటించాడు. ఈ టీంలో కీపర్‌గా ధోనిని కాదని రిషబ్ పంత్‌కు చాన్స్ ఇవ్వటమే అసలు విషయానికి కారణం.
గంగూలీ ప్రకటించిన టీంలో కెప్టెన్‌గా తన పేరునే ప్రకటించుకున్న దాదా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వార్నర్, రిషబ్ పంత్, స్టయినిస్, జడేజా, అండ్రూ రసూల్, రియాన్ పరాగ్, బుమ్రా, ఆర్చర్‌లకు చోటు కల్పించాడు.
అయితే, యూత్‌ను ఎంకరేజ్ చేయటంలో దాదా అందరికన్నా ముందుంటారని, అందుకే కొంతకాలంగా పంత్ విఫలమవుతూ వస్తున్నా… వెనకేసుకొస్తున్నారని దాదా అభిమానులు అంటున్నారు. గతంలో ధోనికి కూడా ఇలాగే బెంగాల్ టైగర్ మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు గంగూలీ అభిమానులు.
ప్రణయ్ కేసులో మారుతీరావుకు మళ్లీ బెయిల్