బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ బెంగాల్ సీఎం కాబోతున్నారా…? రాజకీయాల్లోనూ దాదాగిరి మొదలవనుందా…? అంటే అవుననే అంటున్నారు గంగూలీ సన్నిహితుడు మాజీ క్రికెటర్ సెహ్వగ్.
తాను గతంలోనే డాషింగ్ కెప్టెన్ గంగూలీ బీసీసీఐ పీఠం అధిరోహిస్తాడని చెప్పా. అన్నట్లుగానే దాదా బీసీసీఐ అధ్యక్షుడయ్యారు. ఇక మిగిలింది సీఎంగా చూడటమే అంటూ కామెంట్ చేశారు టీంఇండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వగ్. తన జోస్యం ఎప్పటికైనా ఫలిస్తుందని తెలిపాడు.
అయితే, బీజేపీతో గంగూలీకి మంచి మితృత్వం ఉంది. అందుకే బీసీసీఐ అధ్యక్షునిగా దాదా ఏకగ్రీవంగా ఎన్నికవ్వగా, బీజేపీ చీఫ్ అమిత్‌షా కొడుకు జైషా గంగూలీ కమిటీలో కీలకపోస్టులో ఉన్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు… దాదాకు బీజేపీతో ఉన్న సంబందాలు. పైగా గంగూలీ అంటే బెంగాల్ వ్యాప్తంగా మంచి పేరు, గుర్తింపు ఉంది. అక్కడ ఇప్పటికే సీపీఎం, కాంగ్రెస్‌లు నామమాత్రంగా తయారవుతుండగా… బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోంది. అధికార తృణముల్ కాంగ్రెస్‌కు దీటుగా గత ఎంపీ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు రాబట్టింది. ఇక రాబోయే అసెంబ్లీ ఎన్నిల్లో బీజేపీని అధికార పీఠంపై కూర్చోబెట్టాలని మోడీ-అమిత్‌షా ద్వయం ఇప్పటికే పావులు కదుపుతోంది. అక్కడ బీజేపికి కూడా గంగూలీ లాంటి ఫేమస్, చరిష్మాటిక్ లీడర్ అవసరం.
ఇలాంటి కీలక సమయంలో… గంగూలీకి అత్యంత సన్నిహితుడైన సెహ్వగ్ సీఎం అంటూ వ్యాఖ్యానించటంపై పోలిటికల్ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది.