కాల్పుల మోతతో దక్షిణాఫ్రికా వణికిపోయింది. జోహెన్నస్ బర్గ్‌లోని ఓ బార్ లో దుండుగులు కాల్పులు జరిపారు. సెవెట్ టౌన్ షిప్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పుల్లో మొత్తం 14 మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులు ఓ మిని బస్సులో బార్ కు వచ్చినట్టు చెప్పారు. వెంటనే బార్ లోకి చొరబడి ఈ ఘాతుకానికి తెగబడినట్టు తెలిపారు.
దుండగులు శక్తివంతమైన తుపాకులతో కాల్పులు జరిపినట్టు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో దొరికిన క్యాట్రిడ్జ్ లను బట్టి కొంతమంది దుండుగులు గ్రూపుగా వచ్చి కాల్పులు జరిపినట్టు గుర్తించాం. అకస్మాత్తుగా తుపాకీ కాల్పుల శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే బార్ నుంచి అందరూ బయటకు పరిగెత్తారు. నిందితుల టార్గెట్ ఏంటో అర్థం కాలేదు’అని పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో శక్తివంతమైన తుపాకులను దుండగులు ఉపయోగించినట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.