దక్షిణాది లేడీ సూపర్ స్టార్‌గా నయనతారకు సినిమా షూటింగులు ఒకే. కానీ మూవీ ప్రమోషన్స్ అంటే చెడ్డ చిరాకు. తాను నటించిన ఏ సినిమా ప్రమోషన్ కైనా హాజరు కాదు. ముందుగానే సినిమా అంగీకరించే సమయంలోనే ప్రమోషన్స్ కు రానని కండిషన్ పెడుతుంది. అయితే ఇటీవల ఆ కండిషన్ కు కాస్త సడలింపు ఇచ్చింది.
కేవలం రెండు సినిమాల కోసం తన కండిషన్ ను పక్కన పెట్టింది. కథానాయిక ప్రాధాన్యం వున్న సినిమాల్లో భారీ విజయాలు అందుకున్న నయనతార ఒక్కో మూవీకి ఏడు కోట్ల పారితోషికం తీసుకుంటుందనే టాక్ ఉంది. భారీ పారితోషికం చెల్లించినా నయన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు మాత్రం రాదు.
నయన్ ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలకు ప్రమోషన్ కండిషన్ మినహాయింపు ఇచ్చిందట. నయన్ మెగాస్టార్ చిరంజీవి సరసన సైరాలో, తమిళ అగ్ర హీరో విజయ్ సరసన బిగిల్ సినిమాలో నటిస్తోంది. ఈ రెండు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలకు నయన్ హాజరు కాబోతోంది. సైరా సినిమా అక్టోబర్ రెండో తేదీన విడుదల కాబోతోంది. చెన్నైలో జరిగే ప్రమోషన్ ఈవెంట్‌తో పాటు హైదరాబాద్ లో జరిగే ప్రీ రిలీజ్ వేడుకకు నయన్ హాజరు కానుందని సమాచారం. ఈ నెల 19న జరుగనున్న ఆడియో లాంఛ్ ఈవెంట్‌కు హాజరు కావాల్సిందిగా నయన్‌కు బిగిల్ చిత్ర బృందం నుంచి అందిన ఆహ్వానానికి నయన్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.