దక్షిణ కొరియాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తాజాగా గురువారం గరిష్ఠ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 621,328 కొవిడ్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు.
దీనిపై కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ (కేడీసీఏ) ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వల్ల మరింత భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది.
రాబోయే రోజుల్లో చాలా మంది ప్రజలు వైరస్ బారిన పడతారని పబ్లిక్ సర్వేలో తేలినట్టు కేడీసీఏ పేర్కొంది. మరి కొంతమంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోనున్నట్టు తెలిపింది.
వైరస్ బారిన పడి గురువారం 429 మంది మరణించినట్టు అధికారులు తెలిపారు. బుధవారం ఒక్క రోజే రికార్డు స్థాయిలో 400000లకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా గురువారం అంతకు మించి కేసులు నమోదు కావడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు.