• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » National » కొరియన్ యువతిని వేధించిన ముంబయి యువకులు!!

కొరియన్ యువతిని వేధించిన ముంబయి యువకులు!!

Last Updated: December 1, 2022 at 1:57 pm

ముంబయిలో కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోయారు. ఓ కొరియన్ యువతిపై వేధింపులకు పాల్పడ్డారు. ఆమె ఓ యూట్యూబర్ కావడంతో లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగా కొందరు ఆమెను తాకుతూ, ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు. ముంబయి సబర్బ్‌లోని ఖర్ ప్రాంతంలో రాత్రి ఈ ఘటన జరిగింది. బాధిత యువతి లైవ్ స్ట్రీమింగ్‌లో ఉండగా కొందరు యువకులు ఆమె చేయి పట్టుకుని బైక్ వద్దకు లాక్కెళ్లారు.

ఆమె దానికి ‘నో.. నో’ అని అరిచింది. ఆమె ప్రతిఘటిస్తున్నా వదలని ఓ యువకుడు ఆమె చేయి పట్టుకుని లాక్కెళ్లాడు. ఆ తర్వాత ఆమెను ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేశాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న ఆమె వెంటనే అక్కడి నుంచి ముందుకు నడిచింది.

కానీ మళ్లీ వెనుక వచ్చిన యువకులు లిఫ్ట్ ఇస్తామని ఆమెకు చెప్పారు. ఇందుకు నిరాకరించిన ఆమె తన ఇల్లు సమీపంలోనే ఉందని వచ్చీరాని ఇంగ్లిష్‌లో చెప్పింది. ఈ మొత్తం ఘటన అప్పటికే లైవ్ స్ట్రీమింగ్ అయింది. అయితే ఈ వీడియోను రీట్వీట్ చేసిన బాధిత యువతి తన పరిస్థితి గురించి వెల్లడించింది.

” ఆ యువకుడితోపాటు మరో వ్యక్తి ఉండడంతో పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించాను. గత రాత్రి నేను లైవ్ స్ట్రీమ్‌లో ఉండగా ఈ ఘటన జరిగింది. నేను మరీ అంత స్నేహపూర్వకంగా ఉండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు చెప్పారు. కానీ ఈ ఘటన షాకింగ్‌కు గురి చేసింది” అని ఆ యువతి తెలిపింది.

ఈ వీడియో వైరల్ కావడంతో చాలా మంది ఆ యువకులను అరెస్ట్ చేయాలని ముంబయి పోలీసులకు ట్యాగ్ చేశారు. ఈ వీడియో చూసి విదేశీయులకు భారత్‌పై ఉండే గౌరవం పోయే అవకాశం ఉంటుందని చాలా మంది కామెంట్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు తమంత తామే కేసు నమోదు చేసి ఆమెను వేధింపులకు గురిచేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.

Last night on stream, there was a guy who harassed me. I tried my best not to escalate the situation and leave because he was with his friend. And some people said that it was initiated by me being too friendly and engaging the conversation. Makes me think again about streaming. https://t.co/QQvXbOVp9F

— Mhyochi in 🇮🇳 (@mhyochi) November 30, 2022

Primary Sidebar

తాజా వార్తలు

భారత్ జోడో యాత్ర… రాహుల్‌ను కలిసిన ఒమర్ అబ్ధులా ..!

బీఆర్ఎస్ మహారాష్ట్ర బహిరంగ సభ షెడ్యూల్ ఇదే..!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

షర్మిల పాదయాత్రకు గ్రీన్ సిగ్నల్.. కానీ కండీషన్స్ అప్లై

‘యువగళం’ యాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన ఎన్టీఆర్..!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

సొంత నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు… శరత్ చంద్రా రెడ్డికి బెయిల్ మంజూరు…!

మొదలైన ”యువగళం” పాదయాత్ర!

రెడ్ జోన్లో అదానీ కంపెనీ షేర్లు..!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

ఇలాంటి పుత్రుడు సమాజానికి అవసరమా?

ఫిల్మ్ నగర్

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

జమునకు టాలీవుడ్‌, రాజకీయ ప్రముఖుల నివాళులు!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

నాకు ప్రాణహాని ఉంది.. విడాకులు ఇప్పించండి!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

గడుసుతనం.. కొంటెతనం.. ఈ సత్యభామ చిరునామా!

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

సత్యదేవ్ సినిమా టైటిల్ ఇదే

వరంగల్ లో వీరయ్య విజయ విహారం

వరంగల్ లో వీరయ్య విజయ విహారం

ఆలనాటి సత్యభామ ఇక లేరు!

ఆలనాటి సత్యభామ ఇక లేరు!

గ్రాండ్ గా వెంకీ సినిమా ఓపెనింగ్

గ్రాండ్ గా వెంకీ సినిమా ఓపెనింగ్

ఎట్టకేలకు స్పందించిన బాలయ్య..!

ఎట్టకేలకు స్పందించిన బాలయ్య..!

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap