మరో రెండు రోజుల తర్వాత తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు రావొచ్చని వాతావరణశాఖ అంచనా వేసింది. గత నెల 29 న కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు.. తెలంగాణలోకి ఈ నెల 8 నాటికి ప్రవేశిస్తాయని ఈ శాఖ ముందుగా వేసిన అంచనాలు తప్పాయి.
ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పలు ప్రాంతాల్లో అయిదారు డిగ్రీలు అదనంగా పెరగడంతో అధిక వేడి, ఉక్కపోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారని వాతావరణశాఖ రాష్ట్ర అధికారి శ్రావణి అన్నారు. నైరుతి రుతుపవనాల రాకలో ఆలస్యం కారణంగా జూన్ రెండోవారంలోనూ ఈ పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు.
తెలంగాణకు రుతుపవనాలు రావాలంటే ముందుగా కర్నాటక, రాయలసీమల్లో విస్తారంగా వర్షాలు కురవాలి కానీ ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో ఎండలు కాస్తున్నాయని వెల్లడించారు. తెలంగాణలోనే అక్కడక్కడ చిరుజల్లులు, అసాధారణ ఎండలతో మిశ్రమ వేడి వాతావరణం ఉన్నట్లు శ్రావణి తెలిపారు.
మరో 2 రోజుల తర్వాత తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు రావొచ్చని తాజా అంచనా వేశారు. నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం కారణంగా జూన్ రెండోవారంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోందని వెల్లడించారు శ్రావణి.