– కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
యూపీలో యోగీ ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని, ఇప్పుడు సరికొత్త మార్పు కనిపిస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ మార్పును గతంలో సమాజ్ వాది పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్ వాది పార్టీ(బీఎస్పీ)లు తీసుకురాలేకపోయాయని ఆయన తెలిపారు.
ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించిన ఆయన.. ‘ రాష్ట్రంలో పశ్చిమ యూపీ, రోహిల్ ఖండ్ లలో మాఫియాను సీఎం యోగీ తుదముట్టించారు. గతంలో మాఫియాను చూస్తే పోలీసులు పరుగులు తీసేవారు. ఇప్పుడు కాలం మారింది పోలీసులను చూస్తే మాఫియా భయంతో పరుగులు తీస్తోంది” పేర్కొన్నారు.
‘ ఈ మార్పును ఎస్పీ-బీఎస్పీలు తీసుకురాలేకపోయాయి. వాటికి కుల సమీకరణాల ముఖ్యం. అందుకే వారు మాఫియాకు రక్షణ కల్పించారు. బీజేపీకి అలాంటి సమీకరణాలు లేవు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ అన్న మోడీ మంత్రం ఆధారంగా బీజేపీ పనిచేస్తోంది” అని అన్నారు.
‘ రాష్ట్రంలో ముగ్గురు పెద్ద మాఫియా డాన్లు ఉండేవారు. వారు అజమ్ ఖాన్, అతిఖ్ అహ్మద్, ముఖ్తార్ అన్సారీలు. వీరంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ?. మాఫియాను జైళ్లోకి నెట్టిన ఘనత బీజేపీ. ఎస్పీ,బీఎస్పీలు మరోసారి అధికారంలోకి వస్తే వీరంతా జైళ్లో ఉంటారా ? అలోచించండి” అని చెప్పారు.