సిరిసిల్ల జిల్లాలో జనశక్తి నక్సల్స్ యాక్టివ్ అవుతున్నారని వస్తున్న వార్తలను ఖండించారు ఎస్పీ రాహుల్ హెగ్డే. జిల్లాలో అలాంటి మూమెంట్ ఏమీ లేదన్నారు. ప్రజలెవరూ భయపడొద్దని తెలిపారు.
ఎవరికైనా నక్సల్స్ కు సంబంధించిన సమాచారం తెలిస్తే.. దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలన్నారు ఎస్పీ. జనశక్తి నక్సల్స్ పేరు మీద ఎవరైనా ఫోన్ చేసి బెదిరిస్తే చెప్పాలని స్పష్టం చేశారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పోతిరెడ్డిపల్లి ఫారెస్ట్ ఏరియాలో జనశక్తి నక్సల్స్ మీటింగ్ జరిగిందని ప్రచారం జరుగుతోంది. సుమారు 80 మంది వరకు ఇందులో పాల్గొన్నారని.. సిరిసిల్ల, కొనరావేపేట్, ఎల్లారెడ్డి పెట్, గంభీరావ్ పేట్, ముస్తాబాద్ కు చెందిన మాజీలతో ఈ భేటీ జరిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.
గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న కూర రాజన్న, కూర అమర్ సిరిసిల్లకు చెందిన మాజీ నక్సల్స్ ని పిలిపించుకుని పార్టీ సెక్రెటరీ విశ్వనాథ్ మాట్లాడారని వార్తల సారాంశం. ఈ క్రమంలోనే పోలీసులు అలర్ట్ అయ్యారని.. సమావేశానికి వెళ్లిన వారిని ప్రశ్నిస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే.. జిల్లాలో జనశక్తి నక్సల్స్ కదలికలు లేవని స్పష్టం చేశారు ఎస్పీ రాహుల్ హెగ్డే.