వ్యాపారవేత్త ఎలన్ మస్క్ కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ చేపట్టిన నాన్ ప్రొఫెషనల్ ఆస్ట్రోనాట్స్ టూర్ సక్సెస్ అయింది. మూడు రోజులపాటు రోదసీలో ఉండి.. క్షేమంగా తిరిగొచ్చారు నలుగురు సామాన్యులు. ఫ్లోరిడాలోని అట్లాంటిక్ మహాసముద్రంలో వారి క్రూ క్యాప్సూల్ డ్రాగన్ దిగింది.
నాసా లాంచింగ్ స్టేషన్ నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ను గురువారం ప్రయోగించింది స్పేస్ ఎక్స్. చరిత్రలో తొలిసారి పూర్తి స్థాయి ఆస్ట్రోనాట్స్ లేకుండానే నలుగురు సామాన్యులను స్పేస్ కు పంపింది. 575 కిలోమీటర్ల ఎత్తులో భూమి చుట్టూ చక్కర్లు కొట్టిన వారు క్షేమంగా తిరిగొచ్చారు. స్పేస్ ఎక్స్ చేపట్టిన మొట్టమొదటి ప్రైవేట్ రైడ్ ఇదే కావడం విశేషం.
Splashdown! Welcome back to planet Earth, @Inspiration4x! pic.twitter.com/94yLjMBqWt
— SpaceX (@SpaceX) September 18, 2021
Advertisements
స్పేస్ లోకి వెళ్లొచ్చిన నలుగురి వివరాలు
హేలీ ఆర్సెనాక్స్, డాక్టర్
సియాన్ ప్రోక్టర్, టీవీ నటి
క్రిస్ సెంబ్రోస్కీ, ఏరోస్పేస్ డేటా ఇంజినీర్
జారెడ్ ఐజాక్ మన్