ఏదైనా ఆట ఆడేటప్పుడు గాయాలు కామన్. ముఖ్యంగా బాక్సింగ్ లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. మ్యాచ్ ఆనంతరం ప్లేయర్ గాయాలు లెక్క పెట్టుకోవాల్సిందే. అయితే.. తాజాగా జరిగిన మ్యాచ్ లో స్పానిష్ బాక్సర్ మిరియం గుటిరెజ్ ఫేస్ పై ప్రత్యర్థి ప్లేయర్ అమాండా సెరానో 236 పంచ్ లు ఇచ్చింది. అన్నేసి దెబ్బలు తిన్నాక ఫేస్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.
చూస్తున్నారుగా.. రెండు ఫోటోలను గమనించారా..? మొదటి ఫోటోలో కండలు చూపిస్తున్న ఈమే మిరియం గుటిరెజ్. రెండో ఫోటోలు కుడివైపు ఉన్నది కూడా ఈమే. అమాండా పంచ్ లకు గుటిరెజ్ ఫేస్ ఇలా వాచిపోయింది. అసలు.. గుర్తించలేని విధంగా మారిపోయింది.
మ్యాచ్ అనంతరం దిగిన ఫోటోను అమాండా తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. గుటిరెజ్ క్షేమంగానే ఉన్నట్లు తెలిపింది. ఈ ఫోటోకు ఓ క్యాప్షన్ కూడా పెట్టింది. ‘మీరు ఆనందించారని నేను ఆశిస్తున్నా. నా ప్రత్యర్థి పెద్ద టఫ్ మదర్. ఆమె పట్ల ప్రేమ, గౌరవం ఉన్నాయి” అని తెలిపింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.