కరోనా వైరస్ సోకి స్పెయిన్ యువరాణి మరియా థెరిసా(86) మరణించారు. ఓ దేశానికి యువరాణి అయిన మరియా అత్యంత విలాసవంతమైన భవనంలో ఉంటారు. అదే సమయంలో ఆమె పరిశుభ్రమైన వాతావరణంలో ఉంటుంది అలాంటిది ఆమె కరోనా బారిన పడటం ఆశ్చర్యం కల్గించగా.. కరోనా సోకి చికిత్స పొందుతోన్నమరియా మృతి చెందడం కరోనా తీవ్రతను తెలియజేస్తోంది. యువరాణి మరియా మృతి చెందినట్లు ఆమె సోదరుడు ప్రిన్స్ ఎన్నిక్ డి బోర్బన్ ఫేస్‌బుక్ వేదికగా ప్రకటించాడు. అన్ని జాగ్రత్తలు తీసుకునే ఓ విలాసవంతమైన భవనంలో పరిశుభ్రత వాతావరణంలో ఉండే యువరాణి సైతం కరోనా సోకి మృతి చెందారని తెలుసుకొని ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. యువరాణి కరోనా వైరస్ బారిన పడి మరణించిందంటే తమలాంటి పరిస్థితి ఏంటని సాధారణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
కరోనాను నియంత్రించాలని దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించినప్పటికీ ప్రజలు డోంట్ కేర్ అంటున్నారు. లాక్ డౌన్ ను ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డేక్కుతున్నారు. కరోనా నుంచి దేశం బయటపడి మనుగడ సాగించాలంటే లాక్ డౌన్ ను పాటించాలని ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకు అంత పిలుపునిస్తున్నారు. కరోనా వైరస్ తమ వరకు రాదులే అని చాలామంది అనుకుంటున్నారు. ఇదే అతి విశ్వాసంతో ఉన్న ఆయా దేశాల పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి. మరి అలాంటివారు స్పెయిన్ యువరాణి మరణవార్తతో అయిన ప్రవర్తన మార్చుకుంటారో లేదో చూడాలి.