ఇటీవల రాంగోపాల్ వర్మ రిలీజ్ చేసిన కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాలో అసెంబ్లీ అంశంపై సీన్ వచ్చినప్పుడు స్పీకర్ పాత్రలో అలీ నిద్రపోతున్నట్టు చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అదే విషయం పై తమ్మినేని స్పందించారు.
రాంగోపాల్ వర్మ ఇలా చిత్రీకరించడాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. డిసెంబర్ 2 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో స్పీకర్ తమ్మినేని సీతారాం మీడియాతో మాట్లాడారు. స్పీకర్ గా నేను శాసనసభ్యులు ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, తమ్మినేని సీతారాం అనే నేను ముందు శాసన సభ్యుడినని, ఆ తరువాత అసెంబ్లీ స్పీకర్ అయ్యానని, కళ్ళముందు జరుగుతున్న అన్యాయం పై మాట్లాడే హక్కు నాకుందన్నారు. ఒక శాసన సభ్యుడిగా సమస్యల పై మాట్లాడే స్వేచ్ఛ ఉందంటూ స్పష్టం చేశారు. కానీ ప్రతిపక్షాల ధోరణి బాగోలేదని, అసెంబ్లీ స్పీకర్ చైర్ ని అగౌరపరిచే విధంగా మాట్లాడుతున్నారన్నారు.