గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం తొడగొట్టారు . శ్రీకాకుళం జిల్లా బూరుజి మండలంలో నూతనంగా నిర్మించిన గ్రామ వాలంటీర్ల నియామకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయనకి ఎదురైన ఓ అనుభవాన్ని వివరిస్తూ.. ఓ మహిళ మళ్లీ జగన్ కే ఓటేస్తామని తొడగొట్టి చెప్పిందన్నారు.
ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చకపోవడం వల్ల గత ఎన్నికల్లో ఆయనను ప్రజలంతా ఓడించారని శాసన సభాపతి తెలిపారు. యువతకు ఉద్యోగాలు, రైతు రుణాలు మాఫీ చేస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని.. ఇలా సవాలక్ష మాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని అన్నారు.
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లగా.. ఓ మహిళ మళ్లీ జగన్ కే ఓటేస్తామని తొడ కొట్టి చెప్పిందని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే ఆమెలాగే స్పీకర్ తమ్మినేని కూడా తొడ కొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు.