పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రంలో నివేద థామస్, అంజలి, అనన్య కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా పై ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆఫ్ షోర్ రిజర్వాయర్ ను పూర్తిచేసి హనుమంతు అప్పయ్యదొర పేరు పెడతామని… రాజకీయాల్లో పదవులు శాశ్వతం కాదని…..మనం చేసే పనులే శాశ్వతమని అన్నారు. అప్పయ్య దొర ఆశయాలను కొనసాగిస్తామని… వకీల్ సాబ్ సినిమా చూస్తుంటే అప్పయ్యదొరే గుర్తుకు వచ్చారన్నారు.
అయితే వకీల్ సాబ్ సినిమాను అప్పయ్య దొరకు అంకితం చేయొచ్చని అన్నారు సీతారాం. సినిమాలో పవన్ క్యారెక్టర్ మాదిరిగానే అప్పయ్య దొరలో ఆ తరహా పోరాటాన్ని తాను స్వయంగా చూశానని అన్నారు స్పీకర్.