ప్రధాని నరేంద్ర మోడీ రథంపై స్వారీ చేస్తున్నట్లుగా కళాకారులు రూపొందించిన పెయింటింగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పెయింటింగ్ లో కృష్ణుడూ, అర్జునుడూ రెండూ అంటూ వేసిన మోడీ ఫొటో ఆసక్తికరంగా మారింది. పెయింటింగ్ అంతా కాషాయ రంగుతో.. రథం ఏర్పాటు చేసి ఆ రథంలో మోడీ కూర్చొని సవారి చేస్తున్నట్లుగా ఉంది.
జులై 1న నగరానికి వచ్చిన నడ్డా.. ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అందులో మోడీ పెయింటింగ్ అందరికి ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు జేపీ నడ్డా. పెయింటింగ్ అర్థాన్ని ఎగ్జిబిషన్ ఇన్ఛార్జి రాకేష్ రెడ్డి వివరిస్తూ … మహా భారతంలో కృష్ణుడి రథాన్ని స్వారీ చేస్తూ అర్జునుడి సందేహాలను నివృత్తి చేస్తూంటాడు. ఆత్మ విశ్వాసాన్ని నింపుతూ అధర్మంపై ధర్మం గెలిచేలా చేయడం దాని సారాంశమని తెలిపారు.
దీనికి సారూప్యంగా కలియుగంలో ప్రధాని మోడీ స్వయంగా తానే కృష్ణుడు.. అర్జునుడి అవతారాలను పోషిస్తూ భారత ప్రగతి చక్రాన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకుని వెళ్తున్నారని అర్థం. ఇదే పెయింటింగ్ ప్రత్యేకత అని పేర్కొన్నారు.
పెయింటింగ్లో రథం వెనుక మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కీలకమైన విధాన నిర్ణయాలు లోగోల రూపంలో ఉన్నాయని వివరించారు. దేశాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా చేయడంలో ఆయన చేస్తున్న కృషి ఈ పెయింటింగ్లో కనిపిస్తుందన్నారు.
ఈ నేపథ్యంలో మేక్ ఇన్ ఇండియా, జన్ ధన్ యోజన, ఉజ్వల్ యోజన, డిజిటల్ ఇండియా, ఖేలో ఇండియా, జీఎస్టీ, స్వచ్ఛ భారత్, ఆర్టికల్ 370 రద్దు, రామ మందిరం, హర్ ఘర్ నల్ పానీ… ఇలాంటి అనేక పథకాలను పెయింటింగ్లో చిత్రీకరించారు