వడ్డీ కాసుల వాడిగా పేరున్న తిరుమల శ్రీవారికే శఠగోపం పెట్టాలనుకున్నాడు ఏఈవో శ్రీనివాసులు. దాదాపు 7.36లక్షల విలువ చేసే అభరణాలు మాయం అయినట్లు ఆరోపణలు రావటంతో విచారణ చేపట్టిన టీటీడీ… నగలు మాయం అయినట్లు నిర్ధారించింది. టీటీడీ ట్రెజరీ ఏఈవోగా పనిచేస్తున్న శ్రీనివాసులు ఈ చోరీ చేశారని గుర్తించి, ప్రతి నెల అతని జీతం నుండి 25వేలు రికవరీ చేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.
5 కేజీల వెండి కిరీటం, 2 ఉంగరాలు, ఓ నెక్లెస్ అపహరణకు గురైనట్లు టీటీడీ విచారణలో తేలింది.