భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌లో మార్పులు అనివార్యమవుతున్నాయి. చాలా సమస్యలకు పోర్టల్ ద్వారా పరిష్కారం దొరక్కపోవడంతో.. మళ్లీ ప్రజలు అధికారులనే ఆశ్రయించాల్సి వస్తోంద. దీంతో తరచూ పోర్టల్‌లో కొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టాల్సి వస్తోంది. తాజాగా ధరణి పోర్టల్‌లో మరో ఆప్షన్‌ను పొందుపరిచారు.
పొరపాటున పాస్‌బుక్‌లో భూవిస్తీర్ణం తగ్గించి నమోదు చేస్తే.. ఇన్నాళ్లు ధరణి పోర్టల్ సాయంతో సరిచేసుకునేందుకు అవకాశం లేకుండాపోయింది. అయితే తాజాగా ఆ అవకాశం ప్రభుత్వం కల్పించింది. పోర్టల్‌లో మిస్సింగ్ సర్వే ఎక్స్‌టెంట్ అనే ఆప్షన్‌ను పొందుపరిచింది. అధికారుల తప్పిదాలు, ఇతరత్రా కారణాలతో తక్కువ భూవిస్తీర్ణం నమోదైతే పోర్టల్‌లో అప్లై చేసుకోవాలి. అధికారులు దాన్ని పరిశీలించి.. సరిచేస్తారు.