ఓ వైపు రాజకీయాల్లో బిజీ అవుతూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ స్థాపన అనంతరం ఆయన కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చారు. తరువాత ఆయన ఇక మొహానికి రంగేసుకుంటారా లేదా మీమాంస కొనసాగుతున్న సమయంలోనే పవన్ పింక్ రీమేక్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. బాలీవుడ్ లో అదరగొట్టిన ఈ సినిమాను తెలుగులో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు వకీల్ సాబ్ లేదా లాయర్ సాబ్ అనే టైటిల్ లు పరిశీలనలో ఉన్నాయి. రెండింటిలో ఎదో ఒకదాని ఫిక్స్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను చేస్తుండగానే పవన్ మళ్ళీ గ్లామర్ ఫీల్డ్ లోకి అడుగుపెడుతున్నారని తెలుసుకొని పలువురు దర్శక నిర్మతలు ఆయనతో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు. ఇక క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు పవన్ అంగీకరించడంతోపాటు, గబ్బర్ సింగ్ తో పవర్ స్టార్ కు సూపర్ డూపర్ హిట్ అందజేసిన హరీష్ శంకర్ తో కూడా జత కట్టేందుకు పవన్ ఒకే చెప్పేశాడు.
ఇక క్రిష్ దర్శకత్వంలోని సినిమా పండగ సాయన్న జీవిత కథ ఆధారంగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీగా రూపొందుతోంది.ఈ సినిమా కోసం పడవ సెట్ ను ఆర్ట్ డైరక్టర్ హైదరాబాద్ నగర శివార్లలో ఏర్పాటు చేస్తున్నారు. అయితే పవన్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ చిత్రాన్ని సాధ్యమైనంత తొందరగా షూటింగ్ ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇదిలా ఉండగా… పవన్ స్టార్ మరోసారి సీనియర్ హీరోయిన్ భూమికతో రొమాన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది.పవన్ హీరోగా వచ్చిన ఖుషీ సినిమాలో భూమిక హీరోయిన్ గా అదరగొట్టింది. దాంతో మరోసారి పవన్ కు జోడీగా భూమికను తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇందుకుగాను దర్శకుడు క్రిష్ భూమికను సంప్రదించగా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. భూమిక ఇటీవల బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన రూలర్ సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఆమె హీరోయిన్ గా కాకపోయినా ప్రాధాన్యత ఉన్న పాత్రలను చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు.