హీరోయిన్ సమంత కోసం ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు సమంత కోసం 3 కోట్ల రూపాయలతో భారీ సెట్ వేశారు యశోద సినిమా మేకర్స్. విలాసవంతమైన ఈ సెవెన్ స్టార్ హోటల్ సెట్ లో కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారట.
ఆర్ట్ డైరెక్టర్ అశోక్ ఈ సెట్‌ని రియల్‌గా ఉండేలా వేసినట్లు ఫోటోలు చూస్తే అర్ధం అయిపోతుంది. ద్వయం హరి – హరీష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యశోద సినిమాను సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.ప్రస్తుతం సమంత కేరళలో వెకేషన్‌లో ఉంది.
అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా పోస్ట్ చేసింది ఈ బ్యూటీ. ఇకపోతే ఇటీవల పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ చేసిన ఈ అమ్మడు శాకుంతలం సినిమా కూడా చేస్తుంది.