ఇవాళ ఏప్రిల్ 1. ఏప్రిల్ ఫూల్ అంటూ అందరినీ ఫూల్స్ చేసే మనల్ని కరోనా వైరస్ తో మనమంతా ఫూల్స్ అని ప్రూవ్ చేసుకున్నాం.ప్రకృతిని నాశనం చేసి, ఇంతకాలం మనుషులుగా కాకుండా మెషీన్లు గా బతికిన మనందరినీ మన అందరం ఫూల్స్ అని గుర్తు చేసింది కరోనా. ఇంట్లోనే చావండిరా అని ఫూల్స్ ను చేసింది . మరి ఏప్రిల్ 1 రోజు కరోనా వల్ల మనం ఎలా ఫూల్స్ అయ్యామో చూద్దాం.
ప్రకృతి విరుద్దమైన పనులు:
మన రోజు వారీ జీవితంలో ప్రకృతిని పూర్తిగా నాశనం చేస్తున్నాం.చిన్న చిన్న ప్రాణులను బతకకుండా చేస్తున్నాం.వాహన కాలుష్యంతో ఓజోన్ పొరకు చిల్లు పెడుతున్నాం. రయ్ రయ్ మంటూ బైక్లు , కార్ల మీద దూసుకెళ్ళాం. ఇప్పుడేమైంది అన్నీ మూసుకొని ఇంట్లో కూర్చున్నాం.చేసింది చాలు ఇంట్లో పడి ఉండండని ఏప్రిల్ 1 మనల్ని ఫూల్ చేసింది.ఇంతకాలం మనం ఫూల్స్ అని మనకే తెలియకపోతే కరోనా గుర్తు చేస్తోంది.
కుటుంబానికి సమయం ఇచ్చింది ఎప్పుడు:
బిజీ లైఫ్ అంటూ ఎప్పుడు మనం కుటుంబానికి దూరంగానే ఉన్నాం. అసలు మాగవాడు ఇంట్లో భార్యను పట్టించుకున్నాడా? కలిసి కూర్చొని భోజనం చేసి ఎంతకాలం అయింది? పిల్లలతో గడిపిన సందర్భాలు ఎన్ని? ఇలా బిజీ లైఫ్ అని,కుటుంబానికి దూరంగా ఉన్నాం. అందుకే, అరే ఫూల్ ఇది కాదురా జీవితం అంటే అని కరోనా ఏప్రిల్ 1 రోజు మనకు గుర్తు చేస్తోంది.ఇప్పుడు అందరూ తమ తమ పెళ్లి సీడీ లు చూస్తూ ప్రేమానురాగాలు పంచుకుంటున్నారు.పిల్లలతో ఆడుకుంటున్నారు. మరి ఇంతకాలం ఫూల్స్ ఎవరు? మనమే కదా? వంద శాతం మనమే.
ఇంటి భోజనం తిని ఎన్ని రోజులైంది?
ఇంట్లో వంట చేయడం అందరికీ బద్దకంగా మారింది. కర్రీ పాయింట్ల వెంట పడుతున్నారు. ఇక ఇప్పుడు బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. స్విగ్గీ, జోమటో లు వచ్చాక పొయ్యి వెలిగించడమే మానేశాం.కానీ ఇప్పుడు కరోనా ఫూల్ ఫూల్ అంటూ అందరినీ ఇంటికే పరిమితం చేసి ఇంటి భోజనం చేయరా అంటోంది.పిజ్జా లు, బర్గర్లు వదిలి పెట్టమంటోంది.ఇంట్లో భోజనం తో ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని గుర్తుచేస్తోంది.ఇక పని మనిషి లేకుంటే ఇంట్లో పని జరగదు. మరి ఇప్పుడు, ఒళ్ళు వంచి చెట్లకు నీళ్ళు మనమే పొస్తున్నాం, ఇంట్లో గిన్నెలు మనమే కడుగుతున్నాం, ఇల్లంతా మనమే శుభ్రంగా ఉంచుకుంటున్నాం.పని జరుగుతోంది, పైసలు మిగులుతున్నాయి. పనికి పని , ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి ఇంతకాలం ఫూల్స్ ఎవరు మనమే కదా?
డబ్బే జీవితంగా గడిపాం
డబ్బు లేనిదే జీవితం లేదు అని బతికాం. పేదొడు పెద్దోడు అంటూ గీతాలు గీసుకొని మరీ బతికాం. డబ్బుతో కరోనా రాకుండా చేయగలరా. నీకున్న ఆస్తి , అంతస్తుతో కరోనా ను ఏదుర్కొగలవా? అధికారం ఉంది కదా అని, ఇష్టం వచ్చినట్టు వెనకేసుకున్నాం. పిల్లికి బిచ్చం పెట్టని నువ్వు, బయటకు రాకుండా భయపడి బతుకున్నావ్. ఏం లాభం. అందరిలాగే నువ్వు కూడా చచ్చినట్టు ఇంట్లోనే ఉన్నావ్. మనిషిని మనిషిగా చూడమని కరోనా గుర్తు చేస్తోంది. ఎదిగితే ఒదిగి ఉండమని కరోనా మనందరికీ నేర్పిస్తుంది. మరి మన బతుకంతా ఫూల్ కాక మరేంటి?
ఇలా మనమంతా జీవితంలో అన్ని కోల్పోయి ఫూల్స్ గా బతికాం.కరోనా ఒకరకంగా మనల్ని మనుషులుగా బ్రతకమని గుర్తు చేస్తోంది.ఇప్పటికైనా మనం ఫూల్స్ కాదని నిరూపిద్దాం.