క్రిస్మస్ పండుగ వచ్చేస్తుందంటే చాలు క్రైస్తవుల ఇంటిపై క్రిస్మస్ స్టార్ ఖచ్చితంగా ఉంటుంది. సెమీ క్రిస్మస్ నుండే ఈ స్టార్ పెట్టేస్తుంటారు. ఆ స్టార్ ఉందంటే క్రిస్టియన్ సోదరుల ఇళ్లు అనుకోవచ్చు. కానీ ఆ స్టార్‌ను ఎందుకు పెడతారు…? క్రిస్మస్‌కు స్టార్‌కు ఏం సంబంధం అనేది చాలా మందికి తెలియదు.
కొడుకునే కాదు తండ్రినీ లైన్‌లో పెట్టిన చందమామ
క్రీస్తు జన్మించిన స్థలానికి మార్గం చూపిన తారగా క్రిస్మస్ స్టార్ భావిస్తారు అని చెబుతుంటారు. ఏసుక్రీస్తు జన్మించిన వెంటనే ఆకాశంలో కొత్త నక్షత్రం పుట్టిందని, మిగతా నక్షత్రాలకన్నా ఎక్కువ ప్రశాంతంగా వెలుగుతున్న ఆ నక్షత్రాన్ని చూసి… జగతిని కాపాడే గొప్పవారు జన్మించినట్టు అని అటు వైపు ప్రయాణించారు. ఈ నక్షత్రం జెరూసలెంలోని బెత్లహంలో పశువుల కొట్టం వద్ద తన ప్రయాణాన్ని ఆపింది. అక్కడే అప్పుడే పుట్టిన ఏసును కొనుగొన్నారు అని పూర్వీకులు చెబుతుంటారు. అందుకే క్రీస్తు జన్మించిన చోటును చూపింది నక్షత్రం కాబట్టి… స్టార్‌ను ఇంటిపై ఉంచుతారని ప్రసిద్ధి.
అల్లు అర్జున్ బుట్టబొమ్మ వచ్చేసింది
క్రిస్మస్ పెడితే చాలు ఇంట్లో పండుగ వాతావరణం వచ్చేస్తుందని మురిపెంగా చెప్పుకుంటారు క్రైస్తవ సోదరులు.